ఇంట్లోనే కలర్ పెయింట్స్ (Acrylic Paints) తయారు చేయటానికి కావలసినవి:
- ఫేస్ పౌడర్
- ఫెవికాల్
- నీళ్లు
2 చెంచాలు పౌడర్ లో ౩ చెంచాలు ఫెవికాల్ కొన్ని నీళ్లు కలిపి బాగా కలపాలి. అది వైట్ పెయింట్ లాగ తయారు అవుతుంది. చిన్న సైజు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుని ఒకదానిలో వైట్ పెయింట్ తీసుకుని పసుపు కొంచెం వేసి బాగా కలపాలి, అది పసుపు రంగు పెయింట్. ఇంకొక డబ్బా లో కుంకుమ వేసి కలపాలి, అది ఎరుపు రంగు పెయింట్. తరువాత నీలం రంగు పెన్ రీఫిల్ తీసుకుని ఇంకొక డబ్బాలో కలపాలి, అది నీలం రంగు పెయింట్.
ప్రతి డబ్బాలో తెలుపు రంగు తీసుకుని క్రింద చెప్పిన కలర్ కంబినేషన్స్ చెయ్యాలి.
పసుపు + నీలం = ఆకుపచ్చ రంగు.
ఎరుపు + పసుపు = ఆరంజ్.
ఎరుపు + నీలం = వొయిలేట్.
ఆకుపచ్చ + ఎరుపు = బ్రౌన్.
తెలుపు + ఎరుపు = పింక్.
నీలం + తెలుపు = స్కై బ్లూ.
పింక్ + పసుపు + స్కై బ్లూ = లైట్ గ్రీన్.
ఎరుపు + ఆకుపచ్చ + నీలం = నలుపు.
పైన చెప్పిన రంగులు కలిపితే వేరే రంగులు వస్తాయి. మొత్తం 12 రంగుల పెయింట్స్ చేసుకోవచ్చు.
Note: This Article is Written From Video Done By Jyothi Sagar.
0 Comments